ఒమన్‌లో రోడ్ క్లోజర్ అలర్ట్
- July 21, 2018
మస్కట్: సుల్తాన్ కబూస్ రోడ్డుకి సంబంధించి అల్ ఘుబ్రా ఫ్లై ఓవర్ నుంచి రువీ వైపుగా వెళ్ళే రైట్ లేన్ని మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. నిర్వహణ పనుల నిమిత్తం రోడ్డుని మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాయల్ ఒమన్ పోలీస్ సహకారంతో మస్కట్ మునిసిపాలిటీ ఈ మూసివేతను అమల్లోకి తీసుకొస్తున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. ఫ్లై ఓవర్ కింద రోడ్డుని వినియోగించే వాహనదారులు సర్వీస్ రోడ్డుని సర్వీస్ రోడ్డులోకి మళ్ళించబడ్తారు. ఒమన్ పోలీస్ స్టేషన్ వైపుగా ఈ మార్గం వెళుతుంది. వాహనదారులు రోడ్ సైన్స్, హెచ్చరిక బోర్డుల్ని గమనించి, పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







