శాంతి పునరుద్ధరణకు అంగీకారం
- July 21, 2018
గాజా : గాజా స్ట్రిప్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు అటు ఇజ్రాయిల్, ఇటు హమాస్ అంగీకారాన్ని తెలిపాయని హమాస్ ప్రతినిధి ఫవ్జి బర్హమ్ పత్రికలకు తెలిపారు. ఐక్యరాజ్యసమితి, ఈజిప్టు చేసిన ప్రయత్నాల ఫలితంగానే శాంతి స్థాపనకు రెండింటి మధ్య అంగీకారం కుదిరిందని ఆయన చెప్పారు. ఇజ్రాయిల్ బలగాలు జరిపిన దాడిలో డజన్ల సంఖ్యలో పాలస్తీనీయులు మరణించడమే కాకుండా, వేలాది మందికి గాయాలయ్యాయని పాలస్తీనా అధికారులు చెప్పారు. దీనిపై ఇజ్రాయిల్ స్పందిస్తూ ఆత్మ రక్షణ కోసం ప్రతిఘటిస్తున్నామని పేర్కొంది. శాంతి పునరుద్దరణకు సంబంధించిన ప్రకటనపై ఇజ్రాయిల్ అధికారులు ఎవరూ కూడా తక్షణమే వ్యాఖ్యానించలేదు. కాని సైన్యానికి చెందిన ఒక మహిళా ప్రతినిధి మాట్లాడుతూ శనివారం ఉదయం తెల్లవారు జామున గాజాస్ట్రిప్‌లో ఎటువంటి సైనిక చర్య చోటు చేసుకోలేదన్నారు. గాజాస్ట్రిప్ ప్రశాంతంగా ఉందని స్థానికులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







