నాకేం క్యాన్సర్ లేదు.. నేను బాగానే ఉన్నాను.. - లకీ అలీ

- July 21, 2018 , by Maagulf
నాకేం క్యాన్సర్ లేదు.. నేను బాగానే ఉన్నాను.. - లకీ అలీ

‘సై’ సినిమాలో ‘అప్పుడప్పుడు’.. గోదావరి చిత్రంలో ‘చారుమతి ఐ లవ్యూ’.. ‘బాయిస్’ మూవీలో ‘సారేగమే పదనిసె’ లాంటి తదితర పాటలు పాడిన బాలీవుడ్ సింగర్ లకీ అలీ ఇటీవల సోషల్ మీడియాలో ఓ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ అతనిపై పలు అనుమానాలకు తావిచ్చింది. 

‘ప్రియమైన కీమోథెరపీ నువ్వు ఎప్పటికీ ప్రత్యామ్నాయంగా మారకు’ అంటూ  సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అలీ. దీంతో లకీ అలీకీ క్యాన్సర్ సోకిందోమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో లకీ అలీ మీడియా ముందుకొచ్చి ‘నేను బాగానే ఉన్నాను. నేను క్యాన్సర్ బాధితుడను కాను' అంటూ వివరణ ఇచ్చారు. 

ఇటీవల తన స్నేహితుడు క్యాన్సర్‌తో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. కీమెథెరపీ చేయించుకున్నప్పటికీ అతను మృతి చెందాడట. ఈ సందర్భంగానే అలీ ఇటువంటి కామెంట్ చేశాడని తెలిపాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com