అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి

- July 22, 2018 , by Maagulf
అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి

అఫ్ఘానిస్థాన్‌లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో విమానాశ్రయ ఎంట్రన్స్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిలో 11 మంది పౌరులు మృతి చెందారు. మరో 14 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను భద్రతా దళాలు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామే అని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. మొదటి వైస్ ప్రెసిడెంట్ జనరల్ అబ్దుల్ రషీద్ దోస్తుమ్ కాన్వాయ్ వెళ్లిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com