హైదరాబాద్‌లో ఐఎస్‌తో సంబంధాలున్న కెన్యా యువతి అరెస్ట్
- December 13, 2015
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఓ యువతిని శనివారం ఇంటెలిజెన్స్, నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. టోలిచౌక్‌లో పట్టుబడ్డ ఆ యువతి కెన్యా దేశానికి చెందినదిగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు గుర్తించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మార్కెటింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న రియాజుద్దీన్(మహ్మద్ సిరాజుద్దీన్)ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అమీనా ఐసిస్ సానుభూతిపరురాలని సిట్ పోలీసులు నిర్థారించారు. కర్నాటక గుల్బర్గాకు చెందిన రియాజుద్దీన్, జైపూర్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా యువతీ, యువకులను ఐసిస్‌లో చేర్పించే యత్నం చేస్తున్నాడు. ఉగ్రవాద భావజాలంతో కూడిన వీడియో టేపులు, సాహిత్యాన్ని ఫేస్బుక్ ద్వారా అందిస్తున్నాడని కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు పసిగట్టాయి. రియాజుద్దీన్ ఇచ్చిన సమాచారంతో ఆమెను అరెస్టు చేసినట్టు తెలిసింది. అమీనా(20) ఓ బాయ్ ఫ్రెండ్‌తో రెండు నెలల విడిది కోసం హైదరాబాద్‌కు రాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, పోలీసుల అదుపులోవున్న అమీనాను కేంద్రప్రభుత్వ అనుమతితో తిరిగి శనివారం రాత్రి కెన్యాకు పంపించినట్టు సమాచారం. ఇరవై ఏళ్ల యువతి అమీనా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సిట్ అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..







