విదేశాల్లో మూతబడుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులు
- July 22, 2018
విదేశాల్లో ఉన్న మన ప్రభుత్వరంగ బ్యాంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. విదేశాల్లోని ప్రతి మూడు బ్యాంకుల్లో ఒకటి మూసివేతకు గురైతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకులు దేశంలో బయట ఉన్న 216 బ్రాంచుల్లో 70 బ్రాంచీలను ఈ ఏడాది చివరికల్లా మూసివేస్తున్నట్లు తెలిసింది.
విదేశాల్లోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ లాభాలను ఆర్జిస్తున్న బ్యాంకులను మూసివేయాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. ప్రభుత్వరంగ బ్యాంకుల నుండి తీసుకొన్న రుణాల్లో సుమారు 90 శాతం రుణాలు కూడా రికవరీ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా ఖర్చులను తగ్గించుకొనే క్రమంలో ఇలా బ్యాంకులను మూసివేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఒమన్, యూఏఈ లాంటి గల్ఫ్ దేశాల నుంచి రెవిన్యూ రావడం లేదని ముందుగా అక్కడే ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసేసే ఆలోచనలో ఉంది.
హేతుబద్దీకరణలో భాగంగా ఇప్పటికే ఆరు శాఖలను మూసివేయగా, మరో తొమ్మిది శాఖల మూసివేతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రాసెసింగ్ జరుగుతున్నదని ఎస్బీఐ ఎండీ(రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) ప్రవీణ్ కుమార్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ 36 దేశాల్లో 190 శాఖలను సడుపుతోంది. అయితే విదేశాల్లో ఉన్న మొత్తం శాఖలను మూసివేయాలనుకోవడం లేదని తెలిపారు. విదేశాల్లోని అన్ని శాఖలు పూర్తి స్థాయి కార్యాలయాలు కావని.. వాటిని మూసేయడం వల్ల నష్టమేమీ లేదని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







