'ఝాన్సీ' టీజర్ విడుదల చేసిన హీరో సుధీర్ బాబు

- July 23, 2018 , by Maagulf
'ఝాన్సీ' టీజర్ విడుదల చేసిన హీరో సుధీర్ బాబు

తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధం అవుతుంది. జ్యోతిక
ప్రధాన పాత్రలో నటించగా సన్సేషనల్ డైరెక్టర్ బాల స్వయ దర్శకత్వం నిర్మించబడిన ఈ చిత్రం తెలుగు లో కోనేరు కల్పన మరియు డి అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి తెలుగు టీజర్ ను సమ్మోహనం చిత్రం తో మంచి విజయం సాధించిన యువ హీరో సుధీర్ బాబు విడుదల చేసారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ, "టీజర్ చాల బాగుంది, జ్యోతిక పోలీస్ ఆఫీసర్ గా చూస్తుంటే వారి శ్రీవారు సూర్య గుర్తుకొస్తున్నారు. పోలీస్ సినిమా అంటేనే సూర్య గుర్తుకు వస్తారు. ఇప్పుడు వారి సతీమణి జ్యోతిక పోలీస్ ఆఫీసర్ గా సినిమా చేయటం చాల ఆనందం గా ఉంది. తమిళం లో ఈ చిత్రం బారి విజయం సాధించింది ఇప్పుడు తెలుగు లో ఝాన్సీ అనే పవర్ ఫుల్ టైటిల్ తో మన ముందుకు వస్తుంది. టీజర్ చూసాక సినిమా ఖచ్చితంగా చూడాలి అని అనిపిస్తుంది. తెలుగు లో విడుదల చేస్తున్న నిర్మాతలు కోనేరు కల్పన, డి అభిరాం అజయ్ కుమార్ లకు అల్ ది బెస్ట్" అని అన్నారు. 
జ్యోతిక టెర్రిఫిక్ పర్ఫార్మ్యాన్స్, జివి.ప్రకాష్ అద్భుతమైన నటన,. ఇళయరాజా సంగీతం ఈ చిత్రం సక్సెస్ కి ప్రధారణ కారణం. ఇంత భారీ సక్సెస్ ని అందుకున్న నాచియార్ మూవీ ఇప్పుడు తెలుగులో మరిన్ని సంచనాలు తెరలేపటానికి వస్తుంది. తెలుగులోకి వస్తున్న ఈ మూవీకి ఇప్పటికే మార్కెట్ వర్గాల నుండి పోటా పోటీ బిసినెస్ జరుగుతుంది. త్వరలోనే విడుదల అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com