ఆమ్నెస్టీ పొందాలనుకునేవారి కోసం 9 కేంద్రాలు
- July 23, 2018
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్, 'ప్రొటెక్ట్ యువర్‌సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' అనే పేరుతో అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మూడు నెలల గ్రేస్ పీరియడ్‌లో ఇల్లీగల్ రెసిడెంట్స్, తమ స్టేటస్‌ని సరిదిద్దుకుని, ఎలాంటి చట్టపరమైన సమస్యలూ లేకుండా దేశం విడిచిపెట్టి వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తున్నారు.ఆమ్నెస్టీ పొందాలనుకునేవారు, యూఏఈలో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. అబుదాబీలో రిజిస్ట్రేషన్ సెంటర్ షహామా, అల్ అయిన్, ఘార్బియా తదితర ప్రాంతాల్లోని ఇమ్మిగ్రేషన్స్ సెంటర్స్‌లోనూ, అలాగే దుబాయ్‌లో అల్ అవీర్‌లోనూ రిజిస్ట్రేషన్స్ సెంటర్స్‌ని ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ సెంటర్స్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆదివారం నుంచి గురువారం వరకు పనిచేస్తాయి. యూఏఈలో ఇల్లీగల్ రెసిడెన్సీ స్టేటస్‌ని రెక్టిఫై చేసుకోవడానికి ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు అవకాశం కల్పిస్తున్నారు. స్టేటస్‌ని సరిచేసుకోవడం, లేదంటే దేశం నుంచి బయటకు వెళ్ళిపోవడం వంటి అవకాశాల్ని ఇక్కడ కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనివారిపై చట్టపరమైన చర్యలు తప్పవు
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







