భారీ వర్షాలు..జనావాసాలను ముంచెత్తుతున్నవాగులు వంకలు
- July 23, 2018
తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చగా.. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో నాగావళి మహోగ్రరూపం దాల్చింది. అటు కృష్టమ్మ బిరబిరా దిగువకు పరుగులు పెడుతోంది. నాలుగు రోజుల్లో 50 టీఎంసీల నీరు శ్రీశైలానికి చేరింది.
తెలుగు రాష్ట్రాలు జూలైలోనే జలకళ సంతరించుకుంటున్నాయి. గోదావరి, కృషా నదులకు ఎగువ నుంచి భారీ ఇన్ ఫ్లోలు కొనసాగుతుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. కర్ణాటకలోని ఆలమట్టి ప్రాజెక్టు నుండి నారాయణ పూర్‌కు లక్షా 77వేల క్యూసెక్కులు వరద వస్తోంది. నారాయణపూర్ నుంచి జూరాలకు లక్షా 58వేల క్యూసెక్కుల నీటీని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి లక్షా 50వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది.
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద కొనసాగుతుండగా.. 64వేల 797 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సుంకేసుల జలాశయం నిండు కుండగా మారింది. జూరాల, సుంకేసుల, తుంగభద్ర నుంచి శ్రీశైలానికి లక్షా 77వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం 850అడుగలకు చేరింది. పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో పదిరోజుల్లోనే శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండనుంది. ప్రాజెక్టులపై సమీక్షించిన చంద్రబాబు.. పోతిరెడ్డి పాడు కాలువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.
అటు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం నుంచి దాదాపు 5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి ప్రవాహంతో.. దేవీపట్నం మండలం లో 21తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే దిగువ గోదావరి ఉప్పొంగుతుండగా ఎగువ గోదావరి మాత్రం బోసిపోతోంది. ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు 4 వేల 4 వందల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు 19 వందల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది.
భారీ వర్షాలతో ఒడిషా చిగురుటాకులా వణుకుతోంది. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ జనావాసాలను ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. హిరాకుండ్ ప్రాజెక్ట్ నీటి మట్టం 630 అడుగులు కాగా.. ప్రస్తుతం 615అడుగులకు చేరింది. ఒడిషాలో కురుస్తున్న భారీ వర్షాలతో వంశదార ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోట్టా బ్యారేజీ ప్రమాదకర స్థాయికి చేరింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







