టిక్కెట్ కొనకుండానే 1 మిలియన్ దిర్హామ్ గెల్చుకున్న వ్యక్తి
- July 24, 2018
యూఏఈ జాతీయుడు ఖాలిద్ అహ్మద్ అల్ మర్జోకి, 1 మిలియన్ దిర్హామ్‌ల బంపర్ ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. యూఏఈకి చెందిన ప్రముఖ బ్యాంక్ మంత్లీ డ్రాలో ఈ బంపర్ ప్రైజ్ మనీ ఖాలిద్ అహ్మద్‌కి దక్కింది. ఎమిరేట్స్ ఇస్లామిక్, నెలవారీ కునూజ్ సేవింగ్స్ అకౌంట్ స్కీమ్‌కి సంబంధించిన డ్రా తీయగా, అందులో ఖాలిద్ అహ్మదీజేతగా నిలిచారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు బహుమతి లభించడం పట్ల చాలా ఆనందంగా వుందని ఖాలిద్ అన్నారు. ఎమిరేట్స్ ఇస్లామిక్ నుంచి తనకు ఈ విషయమై సమాచారం అందినప్పుడు తాను నమ్మలేకపోయానని ఆయన వివరించారు. ఎమిరేట్స్ ఇస్లామిక్స్ కునూజ్ సేవింగ్స్ అకౌంట్ ఉన్న వినియోగదారులకు 1 మిలియన్ దిర్హామ్‌లు, టెస్లా కారు లేదా 200,000 దిర్హామ్‌లు గెల్చుకునే అవకాశం వుంటుంది. నెలవారీ తమ ఖాతాల్లో 5,000 దిర్హామ్‌లు ఉంచేవారికి ఈ బంపర్ ఛాన్స్ గెలుచుకునే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!