'కికి' డాన్స్: యూఏఈలో ముగ్గురి అరెస్ట్
- July 25, 2018
గల్ఫ్ ఎమిరేట్ ఆఫ్ అబుదాబీ, ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కెనడియన్ హిప్ హాప్ సూపర్ స్టార్ డ్రేక్స్ హిట్ సాంగ్ 'ఇన్ మై ఫీలింగ్స్' పాటకి ఈ నిందితులు నడి రోడ్డుపై డాన్స్ చేయడమే వారు చేసిన నేరం. కికి డాన్స్ ఛాలెంజ్‌లో భాగంగా, వెళుతున్న కారులోంచి నెమ్మదిగా డోర్స్ ఓపెన్ చేసి, బయటకు వచ్చి మ్యూజిక్‌కి అనుగుణంగా డాన్స్ చేస్తుంటారు. ఇలా చేయడం ప్రమాదకరం. అందుకే నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అయితే అరెస్ట్ చేసిన నిందితుల వివరాల్ని వెల్లడించలేదు. సోషల్ మీడియా వేదికగా ఈ 'కికి' డాన్స్ చాలెంజ్ వైరల్‌గా మారింది. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!