ఆసియాకి చెందిన సేల్స్‌మెన్‌కి జైలు

- July 25, 2018 , by Maagulf
ఆసియాకి చెందిన సేల్స్‌మెన్‌కి జైలు

బహ్రెయిన్:స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తోన్న ఆసియాకి చెందిన సేల్స్‌మెన్‌ ఒకరికి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. హోమ్‌ అప్లయన్సెస్‌ విక్రయిస్తూ నిందితుడు దొంగతనానికి పాల్పడినట్లు అతను పనిచేస్తోన్న కంపెనీ వెల్లడించింది. 1,000 బహ్రెయినీ దినార్స్‌ విలువైన వస్తువుల్ని విక్రయించి, ఆ సొమ్ముని నిందితుడు కాజేశాడని కంపెనీ పేర్కొంది. పనిచేస్తున్న షాప్‌ నుంచి రెండు మొబైల్‌ ఫోన్లనూ నిందితుడు దొంగిలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. హై క్రిమినల్‌ కోర్టు, నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష అనంతరం అతన్ని డిపోర్ట్‌ చేస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com