ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

- July 25, 2018 , by Maagulf
ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి మధ్యాహ్నా భోజన పథకం అమలు కానుంది. ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్‌దాస్‌ బుధవారం విడుదల చేశారు. ఈ పథకానికి రూ.56.53కోట్లు రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. ఆహారం వండేందు కు రూ.23.75కోట్లు, కోడిగుడ్ల సరఫరా కోసం రూ.13.08కోట్లు, వంట వారికి, హెల్పర్లకు పది నెలలకు కలిపి రూ.1.90కోట్లు, రవాణ ఖర్చుల కింద రూ.17.80కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 450 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 1,74,683 విద్యార్థులకు ఈ పథకం అమలు కానుంది. 331 జూనియర్‌ కళాశాలలకు వాటికి అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలల నుంచి ఆహారం అందించడం జరుగుతుంది. మిగిలిన 119 కళాశాలలకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశా లల నుంచి అందిస్తారు. ఈ బాధ్యతలను కూడా కేంద్రీయ వంట శాలలు, ఎన్జీవోలకు ప్రభుత్వం అప్పగించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com