రాత్రిపూట మల్లె పువ్వుల టీని తీసుకుంటే...?
- July 27, 2018
మల్లె పువ్వుల టీ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. వృద్ధాప్య లక్షణాలు దరిచేరనివ్వదు. అంతేకాకుండా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలు ప్రమాదం నుండి కాపాడేందుకు సహాయపడుతుందని అధ్యయనంలో చెప్పబడుతోంది. రాత్రిళ్లు కప్పు మల్లి టీని తీసుకోవడం వలన కలత లేని నిద్ర సొంతమవుతుంది.
ఇందులో జలుబు, జ్వరం వంటి సమస్యల్ని నివారించే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇందులోని కాచెన్స్ అనే గుణాలు జీవక్రియల వేగాన్ని పెంచి ఎక్కువ క్యాలరీలు కరిగేలా చేస్తాయి. మల్లె పరిమళం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఎక్కువ పనులతో అలసటగా ఉన్నప్పుడు ఈ నూనెను వాసన చూస్తే చాలు.
మల్లె చర్మానికి రక్షణగా ఉంటుంది. ఈ నూనె చర్మానికి తేమను అందిస్తుంది. అంతేకాకుండా చర్మంలోని సాగేగుణాలను పెంచుతుంది. దాంతో చర్మం తాజాగా మారి పొడిబారే సమస్య అదుపులో ఉంటుంది. చర్మంపై పేరుకునే రకరకాల మచ్చలను నివారించడంలో ఈ మల్లె నూనె కీలకంగా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!