యూకేలో ఉద్యోగమంటూ.. ఘరానా మోసం
- July 27, 2018
హైదరాబాద్ : యూకే ప్రిన్స్‌సెస్ రాయల్ యూనివర్సిటీ దవాఖానలో ఉద్యోగమంటూ నమ్మించి... ఓ యువతికి సైబర్‌చీటర్లు రూ. 1.75 లక్షల వరకు టోకరా వేశారు. సికింద్రాబాద్, న్యూమెట్టుగూడకు చెందిన వినీతకు ప్రిన్స్‌సెస్ యూనివర్సిటీలో జాబ్ ఇస్తున్నట్లు ఆన్‌లైన్‌లో సమాచారం అందింది, దానికి సంబంధించిన హెచ్‌ఆర్ హెడ్ మోర్‌గెయిన్ క్లీన్ పేరుతో అపాయింట్‌మెంట్ లెటర్ పంపించారు. మూడేండ్ల బాండు, నెలకు 4500 పౌండ్ల జీతంతో నీకు ఉద్యోగం ఇస్తున్నామంటూ ఒప్పంద పత్రాలు పంపించారు. ఆ తరువాత మీ మెయిల్‌ను బ్రిటీష్ హైకమిషన్ ఎంబసీ, ఢిల్లీకి వీసా ప్రాసెసింగ్ నిమిత్తం పంపిస్తున్నామని, అక్కడ గ్రహామ్ మెర్టన్ మీతో మాట్లాడుతాడంటూ నమ్మించారు. ఆ తరువాత యూకే వీసా ప్రాసెసింగ్ కోసం రూ. 29,900 పంపించారు. ఈ సందర్భంగా హైకమిషన్ ఆఫీస్ పేరుతో చెల్లించిన డబ్బుకు సంబంధించిన రశీదులు పంపించారు. ఆ తరువాత మీకు ఐఈఎల్‌టీఎస్ సర్టిఫికెట్ ఉంటేనే, వీసా వస్తుందని, అది తప్పనిసరి అంటూ భయపెట్టించారు. తన వద్ద సర్టిఫికెట్ లేదని చెప్పడంతో, మేం సర్టిఫికెట్ ఇప్పిస్తాం అందుకు రూ.
60 వేలు చెల్లించాలనగా... ఆ డబ్బును చెల్లించింది. అనంతరం రూ. 89, 707 బీటీఏ(బేసిక్ ట్రావెల్ అలవెన్స్‌స్) చెల్లించాలంటూ ఒత్తిడి తెచ్చారు, ఈ డబ్బు చెల్లిస్తేనే ఢిల్లీలోని యూకే ఎంబీసీలోకి వెళ్లేందుకు గేట్‌పాస్ లభిస్తుందంటూ భయపెట్టించారు.
దీంతో బాధితురాలు బజాజ్ ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకొని డబ్బు చెల్లించింది. ఈ తరువాత తిరిగి డబ్బులు అడుగుతుండడంతో ఢిల్లీలోని యూకే ఎంబీసీకి ఫోన్‌చేసి ఆరా తీయగా అలాంటి పేరుతో ఉన్నవారు ఎవరు లేరని, అదంతా మోసమని వారు నిర్థారించారు. దీంతో బాధితురాలు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!