సీఎల్ఎల్వీ సి29 నింగిలోకి దూసుకెళ్లనుంది
- December 13, 2015
పీఎస్ఎల్వీ సి29 కౌంట్‌డౌన్ ప్రారంభం ఇటీవల వరుస విజయవంతమైన ప్రయోగాలతో ఉత్సాహంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో విదేశీ వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈనెల 16న పీఎస్ఎల్వీ సి29 వాహననౌక ద్వారా సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి ఈరోజు ఉదయం ఏడు గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో వాతావరణ పరిశీలనకు సంబంధించిన 400 కిలోల టెలిమోస్ ఉపగ్రహం ఉంది. మిగిలిన అన్నీ నానో ఉపగ్రహాలే. ఆదివారం మధ్యాహ్నం రాకెట్ సన్నద్ధత సమావేశం జరిగింది. ముందస్తు కౌంట్‌డౌన్ ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించారు. 59 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ ముగియగానే బుధవారం సాయంత్రం 6 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సింగపూర్‌కు స్వాతంత్య్రం వచ్చి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దేశ అంతరిక్ష సంస్థ కోరిక మేరకు ఆరు ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి పంపనుంది. మొత్తం 625 కిలోల బరువు గల సింగపూర్ ఉపగ్రహాలతో సీఎల్ఎల్వీ సి29 వాహననౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









