రెండో పెళ్లి ..సౌదీ అరేబియాకి ఉడాయించిన భర్త

- July 28, 2018 , by Maagulf
రెండో పెళ్లి ..సౌదీ అరేబియాకి ఉడాయించిన భర్త

తెలంగాణ:భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకొని సౌదీకి ఉడాయించడంతో బాధితురాలు, బంధు వులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇంటి ఎదుట శనివారం టెం టు వేసి నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలు అమినా వివరాల ప్రకారం... హన్మకొండలోని మహ్మద్‌ హుస్సేన్‌ఖాన్‌, సయిదా దంపతుల కుమార్తె అమినాకు వరంగల్‌ ఎల్‌బీనగర్‌ ప్రాం తానికి చెందిన మహ్మద్‌ అజార్‌, సిరాజ్‌బేగం దంపతుల కుమారుడు మహ్మద్‌ నజీమ్‌తో 2015 నవంబర్‌లో రూ.10లక్షల కట్న కానుకల తో వివాహం జరిగింది.

కొన్ని నెలల క్రితం భార్యను పుట్టింటికి పం పి రెండు నెలల క్రితం మరో యువతిని వివా హం చేసుకుని సౌదీకి ఉడాయించాడని ఆరోపి స్తూ ఎల్‌బీనగర్‌లోని నజీమ్‌ ఇంటి ఎదుట బాధితురాలు అమినా, కుటుంబసభ్యులు శనివారం ఆందోళనకు దిగారు. మహిళా సంఘాల నేతలతో కలిసి ఇంటి ఎదుట టెంట్‌ వేసి నిరసన వ్యక్తంచేశారు. ఈక్రమంలో ఇరు కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీయడంతో ఇంట్లో ఉన్న నజీమ్‌ తండ్రి అజార్‌పై దాడికి యత్నించారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ మహిళా నాయకురాలు రహమున్నీసా మాట్లాడుతూ కట్నం కోసం చిత్రహింసలు పెట్టడం హేయమైన చర్యఅన్నారు.అమినాకు న్యాయం జరిగేవరకు వెనుతిరిగేది లేదని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com