ఇండియా:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
- July 29, 2018
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఓ బంపర్ ఆఫర్ ఊరిస్తున్నది. ఉద్యోగులకు ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) కింద ఇక నుంచి విదేశాలకు కూడా వెళ్లే అవకాశం కల్పించాలని కేంద్రం యోచిస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయం చెప్పాల్సిందిగా హోం, టూరిజం, పౌర విమానయాన శాఖలకు లేఖలు పంపించింది. కేంద్ర విదేశాంగ శాఖ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఎల్టీసీలో భాగంగా ఉద్యోగులు వెళ్లేందుకు ఐదు మధ్య ఆసియా దేశాల పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో కజక్‌స్థాన్, తుర్కమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్ ఉన్నాయి.
మధ్య ఆసియా దేశాలపై భారత్ తన పట్టును మరింత పెంచుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ దేశాలకు వెళ్లే అవకాశం కల్పించాలని విదేశాంగ శాఖ ప్రతిపాదించింది. నిజానికి ఈ ఏడాది మార్చిలోనూ ఎల్టీసీ కింద విదేశీ టూర్లు ఉంటాయని, సార్క్ దేశాలకు వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఎల్టీసీ కింద అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతోపాటు టికెట్ రీయింబర్స్మెంట్ ఇస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 48.41 లక్షల మంది కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







