అక్రమ రవాణా: యువతిని రక్షించిన కాన్సులేట్
- July 29, 2018
దుబాయ్:19 ఏళ్ళ భారతీయ యువతిని ఇండియన్ కాన్సులేట్ రక్షించింది. పంజాబ్‌కి చెందిన బాధిత యువతికి సంబంధించిన సమాచారాన్ని , అదే రాష్ట్రానికి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ విషయంపై స్పందించారు. దుబాయ్ కాన్సులేట్ జనరల్ బాధిత మహిళను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. చైల్డ్ కేర్ టేకర్‌గా దుబాయ్‌లో ఉదోయగం కోసం సిమ్రన్ జీత్ కౌర్ దుబాయ్‌కి వచ్చి, ఇక్కడే సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. తనకు మాయమాటలు చెప్పి దుబాయ్‌కి తీసుకొచ్చిన ఏజెంట్‌ని బాధితురాలు సంప్రదించినా ప్రయోజనం లేకుండాపోయింది. సిమ్రాన్ కేసుని ట్రాఫికింగ్ కేసుగా భావించి, ఆమెకు సహాయ సహకారాలు అందించారు. అజ్మన్‌లో ఇంత వేగంగా ఓ కేసు పరిష్కారమవడం ఇదే తొలిసారి అని అక్కడి సోషల్ వర్కర్స్ కూడా తెలిపారు. ఎట్టకేలకు ఆదివారం దుబాయ్ నుంచి అమృత్‌సర్‌కి బయల్దేరింది బాధితురాలు సిమ్రాన్.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







