రామోజీ ఫిలింసిటీలో 'సాహో' యాక్షన్

- July 30, 2018 , by Maagulf
రామోజీ ఫిలింసిటీలో 'సాహో' యాక్షన్

ప్రభాస్ యాక్షన్ ప్యాక్ 'సాహో'. రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే ప్రభాస్‌ గల్ఫ్‌ దేశాలు చుట్టొచ్చారు. అక్కడ రూ.90 కోట్ల వ్యయంతో యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా వేసిన మార్కెట్ సెట్ లో జరుగుతోంది. ఇక్కడ హీరోయిన్ శ్రద్ధాకపూర్‌తోపాటు, మరికొద్దిమంది నటులు పాల్గొంటున్నారు. దీని తర్వాత ఒకట్రెండు యాక్షన్ సీన్స్ ని కూడా తెరకెక్కిస్తారట. 40రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.
'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాకావడంతో 'సాహో'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీతనంతో తెరకెక్కుస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో సినిమాని విడుదల చేయనున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, ఎవ్లీన్‌ శర్మ, లాల్‌, అరుణ్‌ విజయ్‌, మందిరాబేడి, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిషోర్‌, మహేష్‌ మంజ్రేకర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌ - ఎహసాన్‌ - లాయ్‌. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com