తమిళం లో పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ మూవీ..

- July 31, 2018 , by Maagulf
తమిళం లో పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ మూవీ..

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో..ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో తెలియంది కాదు. పవన్ కాయం కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు తమిళ్ లో తెరకెక్కబోతుంది.

ఈ సినిమాను డబ్బింగ్ చేయడం కాదు రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. రజని - శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న 2 .ఓ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ వారు అత్తారింటికి దారేది రీమేక్ రైట్స్ దక్కించుకుంది. ఈ మూవీ మొత్తం హీరో స్టామినా మీదే ఆధారపడి నడుస్తుంది. అందుకే ఈ చిత్రం లో ఓ టాప్ హీరో చేత రీమేక్ చేయాలనీ చూస్తుందట.

ఆల్రెడీ కన్నడలో ఈ మూవీ రీమేక్ అయి సూపర్ హిట్ అయినా సంగతి తెల్సిందే. 'ఈగ' సినిమాలో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే కిచ్చా సుదీప్ ఈ సినిమా చేశాడు. రన్న పేరుతో వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా మంచి హిట్ కొట్టింది. మరి ఇప్పుడు తమిళ్ లో ఎలా ఉండబోతుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com