స్విగ్గీ బంపర్ ఆఫర్..
- July 31, 2018
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. స్విగ్గీ సూపర్ పేరిట అందుబాటులోకి రానున్న ఈ ఆఫర్లో భాగంగా కస్టమర్లు స్విగ్గీలో మెంబర్షిప్ తీసుకుంటే దాంతో వారికి ఉచితంగా ఫుడ్ డెలివరీలు లభిస్తాయి. 3 నెలల కాలానికి గాను స్విగ్గీ మెంబర్‌షిప్‌ను అందించాలని చూస్తున్నది. ఈ మెంబర్షిప్ రుసుము రూ.99 నుంచి రూ.149 మధ్య ఉంటుందని తెలిసింది. ఇందులో 2 లక్షల మంది కస్టమర్లను చేర్చుకోవాలని స్విగ్గీ ఆలోచిస్తున్నది. ఇప్పటికే 7 పట్టణాల్లో పరిమిత సంఖ్యలో పలువురు కస్టమర్లకు స్విగ్గీ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నది. ప్రస్తుతం ఈ మెంబర్షిప్ ఆఫర్ ప్రయోగాత్మక దశలో ఉంది కానీ అతి త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చని తెలిసింది. కాగా ఫుడ్ డెలివరీ యాప్‌ల పరంగా చూస్తే ఇతర యాప్‌ల నుంచి స్విగ్గీ గట్టి పోటీనే ఎదుర్కొంటున్నది. మరి ఈ మెంబర్షిప్ ప్రయోగం స్విగ్గీకి ఎంత వరకు సక్సెస్‌ను ఇస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







