ఒమన్‌లో లైసెన్స్‌లేని ఫుడ్‌ స్టాల్స్‌ మూసివేత

- July 31, 2018 , by Maagulf
ఒమన్‌లో లైసెన్స్‌లేని ఫుడ్‌ స్టాల్స్‌ మూసివేత

మస్కట్‌: దోఫార్‌ మునిసిపాలిటీ, హెల్త్‌ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా నిర్వహణ లేని కారణంగా ఫుడ్‌ని విక్రయిస్తోన్న కియోస్క్‌ని మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మీట్‌, రైస్‌, ఇతర స్పైసెస్‌తో తయారు చేసే అల్‌ మాద్భి కోసం వినియోగించే కియోస్క్‌, ఆరోగ్యపరమైన పరిమాణాలకు తగ్గట్టుగా లేకపోవడంతోనే ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇన్‌స్పెక్షన్‌ టీమ్స్‌ ఇలాంటి కొన్ని కియోస్క్‌లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశిస్తూ, మరికొన్ని కియోస్క్‌ల లైసెన్స్‌లను రద్దు చేశారు. లైసెన్స్‌ లేకుండా విక్రయాలు సాగిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com