భారతీయ వలసదారుడి మృతి

- July 31, 2018 , by Maagulf
భారతీయ వలసదారుడి మృతి

కేరళకు చెందిన ఓ వ్యక్తి అబుదాబీలో మృతిచెందారు. రెండు నెలలుగా అతని ఆచూకీ దొరకలేదని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. జూన్‌ 19న సముద్రంలో మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడ్ని మొయిదీన్‌న్‌గా గుర్తించారు. మార్చి నెలలో మొయిదీన్‌ ఉద్యోగం కోల్పోయారనీ, ముస్సాఫాలోని ఓ వర్క్‌ షాప్‌లో అప్పటిదాకా పనిచేశారనీ, మార్చిలో ఆ కంపెనీ మూతపడిందనీ అతని సన్నిహితులు పేర్కొన్నారు. మొయిదీన్‌ నుంచి కొంతకాలంగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. రమదాన్‌ సందర్భంలో మొయిదీన్‌తో మాట్లాడినట్లు మృతుడి బంధువు చెప్పారు. మొయిదీన్‌కి సంబంధించిన సమాచారం కోసం కొన్ని వారాలుగా ప్రయత్నిస్తున్న తాను, సోషల్‌ మీడియాలో తనకు తెలిసిన వివరాల్ని ప్రచారం చేశాననీ, వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తామని సోషల్‌ వర్కర్‌ ఎంఎం నాజర్‌ కహన్‌గాద్‌ చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com