సైరా సెట్ ని కూల్చేసిన రెవిన్యూ అధికారులు
- August 01, 2018
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న సైరా కోసం వేసిన సెట్ ను మున్పిపల్ అధికారులు కూల్చివేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా కోసం శేరిలింగంపల్లి రెవిన్యూ పరిధిలో వేశారు. ఆ సెట్స్‌లోనే సైరా మూవీ షూటింగ్ జరుపుతున్నారు. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడంతో చిత్ర నిర్మాతలు ఎలాంటి అనుమతి తీసుకోకుండా యదేచ్చగా షూటింగ్ జరుపుతున్న క్రమంలో రెవిన్యూ అధికారులు సైరాలో కథానాయకుడి ఇంటి సెట్‌ని కూల్చేశారు. గతంలో పలు మార్లు ఆ స్థలాన్ని ఖాళీ చేయమని నోటీసులు పంపిన ఫలితం లేకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ముందస్తు పర్మీషన్ తీసుకుంటే ఉచితంగానే షూటింగ్ చేసుకోనిచ్చేవారమని, కాని వారు అనుమతుల్లేకుండా సెట్స్ వేశారని, అందుకని సెట్స్ మొత్తాన్ని కూల్చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







