మెడిసిన్ సీట్లు ఇప్పిస్తానంటూ మోసాలు
- August 01, 2018
హైదరాబాద్ : మెడిసిన్ సీట్లు ఇప్పిస్తానంటూ దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డ సంతోష్‌రాయ్‌ని బెంగళూర్ పోలీసులు పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే బెంగళూరు పోలీసులు ముందుగా 10 కేసులే అనుకున్నా.. విచారణ అనంతరం బెంగుళూర్‌లో 22 మందిని రూ. 30 కోట్ల వరకు మోసం చేసినట్లు తేలింది. దీంతో సంతోష్‌రాయ్ మోసాల చిట్టా మరింతగా పెరుగుతూ పోతుంది. దేశ వ్యాప్తం గా రూ. 100 కోట్లకుపైగానే వివిధ రకాలుగా సంతోష్‌రాయ్ మోసాలు చేసి ఉంటాడని పోలీసులు బావిస్తున్నారు. ఎంబీబీఎస్, ఎండీ సీట్లు ఇప్పిస్తానంటూ నమ్మించి ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు తీసుకొని దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయలు ముంచేసిన సంతోష్, మనోజ్‌లను గత నెలలో సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
సంతోష్‌రాయ్ 20 ఏండ్లుగా మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడయింది. సంతోష్‌రాయ్‌కు చెందిన బాధితులు దేశ వ్యాప్తంగా ఉన్నారు. హైదరాబాద్‌లో నమోదయిన ఒక్క కేసులో సైబర్‌క్రైమ్ పోలీసులు ఢిల్లీలో నిందితుడి కోసం గాలింపు చేపట్టి ఈ కరుడు గట్టిన చీటర్‌ను అరెస్ట్ చేశారు. ఇతనిని కోర్టు అనుమతితో 7 రోజుల పాటు హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు విచారించగా నకిలీ వైద్య శాలను ఏర్పాటు చేయడం నుంచి నకిలీ సీబీఐ ఆఫీసర్‌గా బెదిరింపులకు పాల్పడిన ఎన్నో విషయాలు ఈ విచారణలో బయట పడ్డాయి. హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల కస్టడీ ముగిసిన అనంతరం, ప్రధా న నిందితుడైన సంతోష్‌రాయ్‌ని బెంగళూర్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
ఇతనిపై ఉన్న కేసులలో విచారణ చేస్తున్న క్రమంలో బెంగుళూర్‌లో మరింత మందిని మోసం చేసినట్లు వెల్లడయింది. మొత్తం 22 మందిని మోసం చేసినట్లు బెంగుళూరు పోలీసులు లెక్కలు తేల్చారు. ఇతనిపై ముంబాయి లో 7 కేసులు నమోదయి ఉన్నాయి. ఇదిలాఉండగా హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు మరో సారి ఈ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లి మరింత లోతైనా దర్యాప్తు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







