తగ్గిన బంగారం ధర...

- August 02, 2018 , by Maagulf
తగ్గిన బంగారం ధర...

మగువల మనసు దోచే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్లున్న పది గ్రాముల బంగారం ధర రూ.31,790లు ఉండగా అది ఈ రోజు రూ.40 తగ్గి రూ.31,750కి వచ్చింది. 8 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32 తగ్గి రూ.25,400 గా పలుకుతోంది. ప్రధాన మెట్రో నగరాల్లో అయితే 22 క్యారెట్ల బంగారం ధర రూ.27,750 కే లభిస్తోంది.

భారత దేశ‌వ్యాప్తంగా వివిధ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.28,300 కు లభిస్తే, చెన్నైలో రూ.28,300కు, ముంబైలో రూ.29,070 ధర పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌, చెన్నైలో రూ.31,110 కాగా ముంబైలో రూ.31,750 ధర పలుకుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com