భాగ్యనగరంలో కాల్పుల కలకలం...
- August 02, 2018
హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి... భూ వావాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగగా... రివాల్వర్‌తో బెదిరిస్తూ గాలోకి ఓ వర్గం కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ బహదూర్‌గూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 307 అయుధ చట్టం సెక్షన్ 27 కింద కేసు నమోదు చేసిన శంషాబాద్ రూరల్ పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
బహదూర్‌గూడ గ్రామంలోని 110 ఎకరాలో వివాధం చోటు చేసుకుంది... సోమాజిగుడాకు చెందిన మహమ్మద్ అల్తాఫ్ ఆ స్థలం దగ్గర సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. గత మంగళవారం సయ్యద్ రఫీ ఇషాక్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి వచ్చి... తమ భూమిలోకి ఆక్రమంగా చొరబడడమే కాకుండా రివాల్వర్‌తో బెదిరిస్తూ సయ్యద్ రఫీ ఒక రౌండ్ కాల్పులు జరిపాడని శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అల్తాఫ్. కాగా, ఈ మధ్యే మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఇలాంటి ఘటనే జరిగింది. వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







