భారత దేశంలో నకిలీ ఇంజనీరింగ్ కాలేజ్ లు...
- August 02, 2018
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కాలేజ్ లు నిర్వహిస్తున్నారని వెలుగు చూసింది. నకిలి ఇంజనీరింగ్ కాలేజ్ ల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
నకిలీ ఇంజనీరింగ్ కాలేజ్ ల జాబితాను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్జ్యుకేషన్ (ఏఐసీటీఇ) సేకరించింది. ఈ వివరాలను గురువారం లోక్ సభలో కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ చెప్పారు. నకిలి ఇంజనీరింగ్ కాలేజీల జాబితాను కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ వివరించారు.
దేశంలో అనుమతి తీసుకున్న సుమారు 277 ఇంజనీరింగ్ కాలేజ్ లు ఉన్నాయి. అయితే అనుమతి లేని ఇంజనీరింగ్ కాలేజ్ లు ఎక్కువగానే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 66 నకిలీ ఇంజనీరింగ్ కాలేజ్ లు ఉన్నాయని, తరువాత తెలంగాణలో 35 నకిలీ ఇంజనీరింగ్ కాలేజీలు, పశ్చిమ బెంగాల్ లో 27 నకిలీ ఇంజనీరింగ్ కాలేజ్ లు ఉన్నాయని కేంద్ర మంత్రి సత్యాపాల్ సింగ్ చెప్పారు.
నాలుగవ స్థానంలో కర్ణాటక ఉందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. కర్ణాటకలో మొత్తం 23 నకిలీ ఇంజనీరింగ్ కాలేజ్ లు ఉన్నాయని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ వివరించారు. ఉత్తరప్రదేశ్ లో 22 నకిలీ ఇంజనీరింగ్ కాలేజ్ లు ఉన్నాయి.
హర్యాణలో 19, మహారాష్ట్రలో 16, తమిళనాడులో 11 నకిలీ ఇంజనీరింగ్ కాలేజ్ లు ఉన్నాయి. ఏఐసీటీఇ నుంచి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న నకిలీ ఇంజనీరింగ్ కాలేజీల జాబితా కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చిందని కేంద్ర మంత్రి సత్యాపాల్ సింగ్ వివరించారు. నకిలీ ఇంజనీరింగ్ కాలేజ్ లను వెంటనే మూసి వెయ్యాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







