విడుదలకు సిద్ధమవుతున్న '90 ఎంఎల్‌' సినిమా

- August 03, 2018 , by Maagulf
విడుదలకు సిద్ధమవుతున్న '90 ఎంఎల్‌' సినిమా

విడుదలకు సిద్ధమవుతున్న 90 ఎంఎల్‌ చెన్నై, న్యూస్‌టుడే: 'కలవాని' వంటి చిత్రాల్లో నటించిన ఓవియాకు ఆ మధ్య అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె దాదాపు కనిపించకుండానే పోయారు. అయితే గత ఏడాది 'బిగ్‌బాస్‌'తో ఈ అమ్మడుకు మంచి క్రేజీ దక్కింది. ఏకంగా 'ఓవియా ఆర్మీ'ని నడిపే స్థాయిలో అభిమానులను సంపాదించింది. ఆ క్రేజీ తర్వాత ఈమెకు పలు సినిమా అవకాశాలు లభించాయి. తాజాగా నటిస్తున్న కొత్త చిత్రం '90 ఎంఎల్‌'. ఇందులో ఓవియా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి. 'కులిర్‌ 100' ఫేమ్‌ అనితా ఉదీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శింబు సంగీతం సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ సినిమా పాటలను విడుదల చేయనున్నారు. ఇందులో ఓవియా భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ప్రేమ, కమర్షియల్‌ అంశాల కలబోతగా ఈ సినిమాను తెరకెక్కించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com