వరల్డ్ చాంపియన్‌షిప్ సెమి ఫైనల్‌లోకి పి.వి సింధు..

- August 03, 2018 , by Maagulf
వరల్డ్ చాంపియన్‌షిప్ సెమి ఫైనల్‌లోకి పి.వి సింధు..

ఒలింపిక్ రజత పతక విజేత, హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్‌ వరల్డ్ చాంపియన్‌షిప్ సెమి ఫైనల్‌లోకి వెళ్ళింది. ఈ మ్యాచ్ లో నొజొమి ఒకుహరను 21-17, 21-19 స్కోరుతో వరుస సెట్లలో ఓడించి సెమి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

హోరా హోరీగా జరిగిన సాగిన ఈ మ్యాచ్‌ను గెలవడంతో ఈ పోటీల్లో పీవీ సింధుకు పతకం ఖాయమైంది. సెమి ఫైనల్‌లో వరల్డ్ నంబర్ టూ ప్లేయర్, జపాన్‌కు చెందిన అకనె యమగుచితో శనివారం తలపడనుంది. పివి సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించగా. సైనా నెహ్వాల్‌, సాయి ప్రణీత్‌, మిక్స్‌డ్‌ జోడీ అశ్విని-సాత్విక్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్లోనే పరాజయం పాలయ్యారు. సైనా నెహ్వాల్‌ 6-21, 11-21 పాయింట్ల తేడాతో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌ చేతిలో ఓటమిపాలైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com