కాక్‌పిట్‌లోకి చొరబడిన వ్యక్తి

- August 04, 2018 , by Maagulf
కాక్‌పిట్‌లోకి చొరబడిన వ్యక్తి

న్యూఢిల్లీ: ఇటలీలోని మిలాన్‌ నుండి న్యూఢిల్లీకి బయలు దేరిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ తీసుకున్న కొద్ది సమయానికి కాక్‌పిట్‌లోకి ఓ ప్రయాణీకుడు బలవంతంగా ప్రవేశించడంతో తిరిగి ఇటలీ విమానశ్రయానికి చేరింది. ఈ ఘటన గురువారం జరిగినప్పటికీ అధికారులు ఆలస్యంగా వెల్లడించారు. అనంతరం ఆ ప్రయాణీకుడిని స్థానకి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని ఎయిర్‌ ఇండియా ప్రతినిథి తెలిపారు. అతడిని భారత సంతతికి చెందిన గురుప్రీత్‌ సింగ్‌గా గుర్తించారు. దీంతో ఈ విమానం 2.35 గంటలు ఆలస్యమైందని, ఇందులో మొత్తం 245 మంది ప్రయాణీకులు ఉన్నారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com