పది గ్రాముల పసిడి ధర రూ.25,850
- December 14, 2015
రూ.26,000 దిగువకు బంగారం ధర ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో గత శనివారం రూ.26,000కు చేరిన బంగారం ధర ఈ రోజు ఆ మార్కు దిగువకు చేరింది. రూ.150 తగ్గడంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,850కి చేరింది. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారులు కొనుగోళ్లు చేయకపోవడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.3 శాతం తగ్గి 1,071.25 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఈ రోజు వెండి ధర సైతం తగ్గింది. రూ.150 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.33,700కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఈ లోహం ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









