పది గ్రాముల పసిడి ధర రూ.25,850

- December 14, 2015 , by Maagulf
పది గ్రాముల పసిడి ధర రూ.25,850

రూ.26,000 దిగువకు బంగారం ధర   ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో గత శనివారం రూ.26,000కు చేరిన బంగారం ధర ఈ రోజు ఆ మార్కు దిగువకు చేరింది. రూ.150 తగ్గడంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,850కి చేరింది. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారులు కొనుగోళ్లు చేయకపోవడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.3 శాతం తగ్గి 1,071.25 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. ఈ రోజు వెండి ధర సైతం తగ్గింది. రూ.150 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.33,700కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఈ లోహం ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com