'వీర భోగ వసంత రాయలు'లో సుధీర్ బాబు లుక్
- August 05, 2018
'వీర భోగ వసంత రాయలు' సినిమాకు సంబంధించి సుధీర్ బాబు ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. సుధీర్ బాబుతో పాటు నారా రోహిత్, శ్రీయ, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రసేన ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే శ్రీయ, నారా రోహిత్ పోస్టర్లు విడుదల చేయగా... తాజాగా సుధీర్ బాబు లుక్‌తో కూడిన పోస్టర్ విడుదల చేశారు.
'వీర భోగ వసంత రాయలు' మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నారు. 'కల్ట్ ఈజ్ రైజింగ్ ' అనేది టాగ్ లైన్. క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో అని ఎవరూ లేరు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ హీరోనే. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం, తెలుగులో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదని చిత్ర బృందం తెలిపింది. రోటీన్ సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందట.
నారారోహిత్, శ్రియా శరణ్ , సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







