దుబాయ్ లో 'సైమా' కు రంగం సిద్ధం

- August 05, 2018 , by Maagulf
దుబాయ్ లో 'సైమా' కు రంగం సిద్ధం

దుబాయ్:సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా), 2018 సంబరం మొదలైంది. సెవెంత్ ఎడిషన్ సైమా అవార్డ్స్ ఈవెంట్ సెప్టెంబర్ 14, 15 తేదీలలో దుబాయ్‌లో వైభవంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఫంక్షన్ ను 'అంజన్ స్టార్ ఈవెంట్స్' సంస్థ నిర్వహించనున్నట్టు  సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ ఉగ్గిన ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని 'బాలీవుడ్ పార్క్స్' లో నిర్వహించనున్నారు. 14వ తేదీన తెలుగు, కన్నడ భాషలకు సంబంధించిన నటీనటులకు అవార్డులు ఇవ్వనుండగా.. 15వ తేదీన తమిళ్, మలయాళ భాషలకు చెందిన నటీనటులకు అవార్డులను అందజేయనున్నారు. ఈ వేడుకకు కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు.

నటీమణుల రాక్ పెర్ఫార్మెన్స్‌తో, సెలబ్రిటీల ఆటపాటలతో ఈ వేడుక వైభవంగా జరగనుంది. ఈ అవార్డ్స్‌కి సంబంధించి సినిమాల ఎంపిక జరిగింది. 2017లో విడుదలైన తెలుగు, కన్నడ భాషల్లోని బెస్ట్ సినిమాల ఎంపిక జరిగింది. ఈ ఎంపికలో రానాకు సంబంధించిన మూడు సినిమాలు ఉండటం విశేషం. బాహుబలి 2, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు వీటిలో ఉన్నాయి. దీంతో ఈ అవార్డ్స్‌కి సంబంధించి రానాయే రాజుగా కనిపిస్తున్నాడు. ఈ సైమా అవార్డ్స్ నామినేషన్స్‌లో వివిధ కేటగిరీలకు సంబంధించి బాహుబలి 2 సినిమా 12 నామినేషన్స్‌ను పొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com