దుబాయ్ లో 'సైమా' కు రంగం సిద్ధం
- August 05, 2018
దుబాయ్:సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా), 2018 సంబరం మొదలైంది. సెవెంత్ ఎడిషన్ సైమా అవార్డ్స్ ఈవెంట్ సెప్టెంబర్ 14, 15 తేదీలలో దుబాయ్‌లో వైభవంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఫంక్షన్ ను 'అంజన్ స్టార్ ఈవెంట్స్' సంస్థ నిర్వహించనున్నట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ ఉగ్గిన ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని 'బాలీవుడ్ పార్క్స్' లో నిర్వహించనున్నారు. 14వ తేదీన తెలుగు, కన్నడ భాషలకు సంబంధించిన నటీనటులకు అవార్డులు ఇవ్వనుండగా.. 15వ తేదీన తమిళ్, మలయాళ భాషలకు చెందిన నటీనటులకు అవార్డులను అందజేయనున్నారు. ఈ వేడుకకు కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు.
నటీమణుల రాక్ పెర్ఫార్మెన్స్తో, సెలబ్రిటీల ఆటపాటలతో ఈ వేడుక వైభవంగా జరగనుంది. ఈ అవార్డ్స్‌కి సంబంధించి సినిమాల ఎంపిక జరిగింది. 2017లో విడుదలైన తెలుగు, కన్నడ భాషల్లోని బెస్ట్ సినిమాల ఎంపిక జరిగింది. ఈ ఎంపికలో రానాకు సంబంధించిన మూడు సినిమాలు ఉండటం విశేషం. బాహుబలి 2, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు వీటిలో ఉన్నాయి. దీంతో ఈ అవార్డ్స్‌కి సంబంధించి రానాయే రాజుగా కనిపిస్తున్నాడు. ఈ సైమా అవార్డ్స్ నామినేషన్స్‌లో వివిధ కేటగిరీలకు సంబంధించి బాహుబలి 2 సినిమా 12 నామినేషన్స్‌ను పొందింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







