మై ఫ్రెండ్, మై వరల్డ్ అంటున్న మహేష్ బాబు

- August 05, 2018 , by Maagulf
మై ఫ్రెండ్, మై వరల్డ్ అంటున్న మహేష్ బాబు

మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యక్తుల్లో ఫ్రెండ్ తప్పకుండా ఉంటాడు. మనం సొంత మనుషులతో చెప్పుకోలేని కొన్ని విషయాలను ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు. వాళ్ళతో ఉన్నంత స్వేచ్ఛగా మరెవ్వరితో ఉండలేరు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు వారి వారి స్థాయిని బట్టి ఫ్రెండ్స్ ఉంటూనే ఉంటారు. మహేష్ బాబు అందుకు మినహాయింపు కాదు. మహేష్ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉన్నదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

వివాదాలకు దూరంగా ఉంటాడు. తన ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే ఫ్రెండ్స్ ఉన్నారట. అందులో ది ఫ్రెండ్ అనేవాళ్ళు ఒకే ఒక్కరు ఉన్నారట. అదెవరో కాదు.. మహేష్ భార్య నమ్రత. భార్యగా, స్నేహితురాలిగా బహుముఖ నమ్రతకు మహేష్ బాబు ఫ్రెండ్ డే శుభాకాంక్షలు చెప్తూ.. ట్విట్టర్ లో ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. " నా ఫ్రెండ్, నా ప్రపంచం అయిన నమ్రతకు ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com