లీడ్ హైజాకర్ కుమార్తెను పెళ్లిచేసుకున్న బిన్ లాడెన్ కుమారుడు

- August 05, 2018 , by Maagulf
లీడ్ హైజాకర్ కుమార్తెను పెళ్లిచేసుకున్న బిన్ లాడెన్ కుమారుడు

ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసమా బిన్‌ లాడెన్‌ తనయుడు హంజా బిన్‌ లాడెన్‌ పెళ్లి చేసుకున్నట్లు అతని కుటుంబం ప్రకటించింది. ‘ది గార్డియన్‌’ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హంజా గురించి సంచలన విషయాలను లాడెన్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 9/11 దాడులకు నేతృత్వం(లీడ్‌ హైజాకర్‌) వహించిన మహ్మద్‌ అట్టా కుమార్తెను హంజా వివాహం చేసుకున్నట్లు వివరించారు.

అల్‌ఖైదాలో హంజాకు సీనియర్‌ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు హంజా సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించారు. హంజాతో తమకు ప్రత్యక్ష సంబంధాలు ఏవీ లేవని తెలిపిన వారు, అల్‌ఖైదా ద్వారా ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగొద్దని హంజాను కోరారు. ప్రభాల్యాన్ని కోల్పోయిన అల్‌ఖైదాకు జీవాన్నిపోసేందుకు హంజా యత్నిస్తున్నాడని పాశ్చాత్య ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీలు పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అతని ఆచూకీ తెలుసుకునేందుకు ఆయా నిఘా సంస్థలు రెండేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. హంజా అఫ్గానిస్తాన్‌లో ఉంటున్నట్లు తమకు సమాచారం ఉందని లాడెన్‌ కుటుంబసభ్యులు తెలిపారు. బిన్‌ లాడెన్‌కు సైతం తమతో సంబంధాలు ఉండేవి కాదని, 1999 నుంచి 2011(చనిపోయే వరకూ) మధ్య ఒక్కసారి కూడా లాడెన్‌ తమను కలవలేదని చెప్పారు. కాగా, గతేడాది జనవరిలో అమెరికా హంజా బిన్‌ లాడెన్‌ను గ్లోబల్‌ టెర్రరిస్టుగా గుర్తించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com