లీడ్ హైజాకర్ కుమార్తెను పెళ్లిచేసుకున్న బిన్ లాడెన్ కుమారుడు
- August 05, 2018
ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసమా బిన్ లాడెన్ తనయుడు హంజా బిన్ లాడెన్ పెళ్లి చేసుకున్నట్లు అతని కుటుంబం ప్రకటించింది. ‘ది గార్డియన్’ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హంజా గురించి సంచలన విషయాలను లాడెన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 9/11 దాడులకు నేతృత్వం(లీడ్ హైజాకర్) వహించిన మహ్మద్ అట్టా కుమార్తెను హంజా వివాహం చేసుకున్నట్లు వివరించారు.
అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు హంజా సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించారు. హంజాతో తమకు ప్రత్యక్ష సంబంధాలు ఏవీ లేవని తెలిపిన వారు, అల్‌ఖైదా ద్వారా ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగొద్దని హంజాను కోరారు. ప్రభాల్యాన్ని కోల్పోయిన అల్‌ఖైదాకు జీవాన్నిపోసేందుకు హంజా యత్నిస్తున్నాడని పాశ్చాత్య ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అతని ఆచూకీ తెలుసుకునేందుకు ఆయా నిఘా సంస్థలు రెండేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. హంజా అఫ్గానిస్తాన్‌లో ఉంటున్నట్లు తమకు సమాచారం ఉందని లాడెన్ కుటుంబసభ్యులు తెలిపారు. బిన్ లాడెన్‌కు సైతం తమతో సంబంధాలు ఉండేవి కాదని, 1999 నుంచి 2011(చనిపోయే వరకూ) మధ్య ఒక్కసారి కూడా లాడెన్ తమను కలవలేదని చెప్పారు. కాగా, గతేడాది జనవరిలో అమెరికా హంజా బిన్ లాడెన్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







