నవంబర్‌ 24న హౌస్‌, మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

- August 06, 2018 , by Maagulf
నవంబర్‌ 24న హౌస్‌, మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

బహ్రెయిన్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌ అలాగే మున్సిపల్‌ కౌన్సిల్స్‌కి ఎన్నికలు నవంబర్‌ 24న జరగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్‌ మొదటి వారంలో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రోలర్‌ అధికారులు వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. 45 రోజులకు ముందుగా మెజెస్టీ ఎన్నికల తేదీని ప్రకటిస్తారు. రాయల్‌ డిక్రీలో ఎలక్షన్స్‌కి సంబంధించి పూర్తి వివరాలుంటాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. 21 ఏళ్ళు నిండిన పౌరులు ప్రతి ఒక్కరూ ఓట్లు వేసే అవకాశం వుంటుంది. ఒకవేళ సిటిజన్‌కి రెసిడెన్స్‌ లేకపోతే, అతని కుటుంబం తాలూకు రెసిడెన్సీ పరిగణనలోకి తీసుకోబడుతుంది. ఐదు రోజులపాటు అన్ని గవర్నరేట్స్‌లోనూ నాలుగు సెంటర్స్‌లో పోలింగ్‌ జరుగుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com