బస్ ఓవర్ టర్న్ ఆరుగురికి గాయాలు
- August 06, 2018
అబుదాబీలోని ఐసిఎడి క్యాంప్ బ్రిడ్జి వద్ద బస్ ఓవర్ టర్న్ కావడంతో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో 14 మంది కార్మికులు ఆ బస్సులో ఉన్నారు. అబుదాబీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బస్సు వెనుక టైరు పేలడంతో అదుపు తప్పి, ఓవర్ టర్న్ అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అబుదాబీలోని ముఫ్రాక్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందుతోంది. అబుదాబీ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ &ఙ్రబిగగేషడియర్ జనరల్ అహ్మద్ అబ్దుల్లా అల్ షెహ్మి మాట్లాడుతూ, వాహనదారులు తమ టైర్లను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, చిన్న చిన్న పగుళ్ళు వుంటే తక్షణం తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాల్ని నివారించుకోవచ్చని చెప్పారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







