భారత దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా బంద్..
- August 06, 2018
ఇవాళ (మంగళవారం)భారత దేశ వ్యాప్తంగా రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ఆటో నుంచి ఆర్టీసీ బస్సు వరకు రోడ్డెక్కే పరిస్థితే లేదు. కేంద్రం తేబోతున్న మోటార్ యాక్ట్ బిల్లుకు వ్యతిరేకంగా కార్మికులు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. MV యాక్ట్ సవరణతో దేశంలోని అన్ని ఆర్టీసీలు నిర్వీర్యం అవుతాయని.. రవాణా రంగం అస్థవ్యస్తంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
మోటార్ వెహికిల్ చట్ట సవరణ బిల్లు 2017 రవాణ రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలో ప్రస్తుతం19 కోట్లకు పైగా మోటారు వాహనాలు తిరుగుతున్నాయి. 15 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. కొత్త ఎంవీ యాక్ట్ అమల్లోకి వస్తే చాలామంది ఉపాధి కొల్పోతారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆటోలు, క్యాబ్ లతో పాటు ఆర్టీసీపై కూడా ప్రభావం ఎక్కువగా వుంటుందని రోడ్డు రవాణా కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







