తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమం
- August 07, 2018
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. అవసరమైన వైద్యం అందిస్తున్నా ఆయన శరీరం స్పందించడం లేదని వైద్యులు స్పష్టంచేశారు. ఆయన ఆర్గాన్స్ క్రమంగా పనిచేయడం మానేస్తున్నాయని తెలిపారు. ఈమేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
కొద్దిసేపటి క్రితం సీఎం పళనిస్వామిని కలిశారు కరుణానిధి కుమారులు స్టాలిన్, అళగిరి, కూతురు కనిమొళి. తమ తండ్రి ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. అటు.. డీఎంకే కార్యకర్తలు చెన్నైకి పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు.
చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నా.. కరుణానిధి ఆరోగ్యం మెరుగు పడలేదు. అత్యంత విషమంగా మారినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో.. డీఎంకే కార్యకర్తలు పెద్దసంఖ్యలో చెన్నై చేరుకుంటున్నారు. కావేరీ ఆస్పత్రి ముందు గుమిగూడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని… పోలీసు ఉన్నతాధికారులందరూ వెంటనే అందుబాటులో ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







