ఇటలీలో భారీ పేలుడు...

- August 07, 2018 , by Maagulf
ఇటలీలో భారీ పేలుడు...

ఇటలీలోని బొలొగ్నా నగరంలో భారీ పేలుడు జరిగింది. విమానాశ్రాయానికి సమీపంలో జనసమ్మర్థంగా ఉండే ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ప్రొపేన్ గ్యాస్ తీసుకెళ్తున్న ట్యాంకర్ ఓ ట్రక్కుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భారీ శబ్దంతో గ్యాస్ ట్యాంకర్ పేలింది. ఈ పేలుడు కారణంగా ఇద్దరు చనిపోయారు. మరో 70 మందికి గాయాలయ్యాయి.
ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ట్యాంకర్ ట్రాఫిక్ లో నిలిచిన ట్రక్కును వెనుక నుంచి ఢీ కొట్టింది. వెంటనే వెలువడిన నిప్పురవ్వలకు ట్యాంకర్ నుంచి వెలువడిన గ్యాస్ మండి పెద్ద పేలుడు సంభవించింది. దీంతో సగం బ్రిడ్జి కుప్పకూలింది. భారీగా ఎగజిమ్మిన మంటలు చుట్టుపక్కన ఎనిమిది లైన్లలోకి చొరబడ్డాయి. అక్కడ ఉన్న వాహనాలన్నీ మంటలకు కాలి బూడిదయ్యాయి. ఇళ్లు, వ్యాపార భవనాలకు ఉన్న గాజు అద్దాలు బద్దలై పలువురికి గాయాలయ్యాయి.
ఉత్తర ఇటలీ, ఆడ్రియాటిక్ తీరానికి కీలకమైన ఈ మార్గాన్ని మూసేశారు. బొలొగ్నా నుంచి దక్షిణాన ఉన్న ఫ్లోరెన్స్, రాజధాని రోమ్ కి దారితీసే రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com