తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమం

- August 07, 2018 , by Maagulf
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. అవసరమైన వైద్యం అందిస్తున్నా ఆయన శరీరం స్పందించడం లేదని వైద్యులు స్పష్టంచేశారు. ఆయన ఆర్గాన్స్‌ క్రమంగా పనిచేయడం మానేస్తున్నాయని తెలిపారు. ఈమేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.

కొద్దిసేపటి క్రితం సీఎం పళనిస్వామిని కలిశారు కరుణానిధి కుమారులు స్టాలిన్, అళగిరి, కూతురు కనిమొళి. తమ తండ్రి ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. అటు.. డీఎంకే కార్యకర్తలు చెన్నైకి పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు.

చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నా.. కరుణానిధి ఆరోగ్యం మెరుగు పడలేదు. అత్యంత విషమంగా మారినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో.. డీఎంకే కార్యకర్తలు పెద్దసంఖ్యలో చెన్నై చేరుకుంటున్నారు. కావేరీ ఆస్పత్రి ముందు గుమిగూడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని… పోలీసు ఉన్నతాధికారులందరూ వెంటనే అందుబాటులో ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com