కరుణానిధి అంత్యక్రియల స్థలంపై సందిగ్ధం..

- August 07, 2018 , by Maagulf
కరుణానిధి అంత్యక్రియల స్థలంపై సందిగ్ధం..

కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలన్నదానిపై సందిగ్ధం నెలకొంది.. మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అవకాశం ఇవ్వాలని డీఎంకే చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించడంతో హైకోర్టుకు చేరింది.. అన్నాదురై సమాధి పక్కనే కరుణ సమాధి ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పింది.. గిండి ప్రాంతంలో రెండు ఎకరాలు కేటాయిస్తామని చెప్పింది.. అయితే, డీఎంకే మాత్రం మెరీనా బీచ్‌నే డిమాండ్‌ చేస్తోంది.. ఈ నేపథ్యంలో డీఎంకేకు చెందిన న్యాయవాదులు పిటిషన్‌ వేశారు. చీఫ్‌ జస్టిస్‌ నివాసంలో అర్థరాత్రి వరకు వాదనలు కొనసాగాయి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది.. మెరీనా బీచ్‌లో నిర్వహించడానికి అభ్యంతరం ఏంటో చెప్పాలని ఆదేశించింది.. దీనిపై ఉదయం 8 గంటలకు తుది వాదనలు జరగనున్నాయి.. ఆ తర్వాత తీర్పును వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.. అటు కోర్టు తీర్పు కోసం కలైంజ్ఞర్‌ అభిమానులు, డీఎంకే శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.. ఎలాంటి నిర్ణయం వస్తుందోనన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది.

మాజీ సీఎం జయలలిత చనిపోయినప్పుడు ఆమె స్మారకాన్ని మెరీనా బీచ్‌లో నిర్మించాలని అన్నాడీఎంకే నిర్ణయించింది.. దీనిపై పలువురు కోర్టుకు వెళ్లారు.. ఇవే పిటిషన్లు ఇప్పుడు కరుణానిధి స్మారకానికీ ఆటంకంగా మారాయి.. అయితే, కరుణ కోసం వాటిని తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషనర్లు అర్థరాత్రి ప్రకటించారు. కరుణానిధి స్మారకానికి ప్రతిబంధకం కాకూడదనే ఉద్దేశంతోనే పిటిషన్లను వెనక్కు తీసుకుంటున్నట్లు న్యాయవాది దొరైస్వామి ప్రకటించారు.

గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు. కొన్ని క్రతువులు పూర్తిచేసిన అనంతరం ప్రజల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాలుకు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com