కెనడాలో ఉద్యోగమంటూ టోకరా...
- August 07, 2018
హైదరాబాద్: కెనడాలో ఉద్యోగం ఇస్తామంటూ నమ్మించి ఓ వ్యక్తికి సైబర్ చీటర్లు రూ. 7.66 లక్షలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళ్తే... నగరంలోని భోలక్‌పూర్, కృష్ణానగర్‌కు చెందిన శ్రీకాంత్ ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఇందులో భాగంగా విదేశాల్లో సూపర్‌వైజర్ ఉద్యోగం కోసం క్వికర్.కామ్‌లో తన బయోడేటాను అప్‌లోడ్ చేశాడు. దీన్ని చూసిన జేమ్స్ అనే వ్యక్తి శ్రీకాంత్‌కు ఫోన్ చేసి, మూడు రౌండ్ల టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఇంటర్వ్యూ లో సెలక్ట్ అయ్యావు, వీసా, వర్క్ పర్మిట్ కోసం అయ్యే ఖర్చు నీవే భరించాలంటూ చెప్పగా .. శ్రీకాంత్ ఒప్పుకున్నాడు. దీంతో సంబంధిత డాక్యుమెంట్లు పంపించాడు. ఆ తరువాత విమాన టికెట్లు కూడా బుక్ చేశామంటూ టికెట్లను స్కాన్ చేసి ఈ-మెయిల్ చేశారు. ఇందుకు ప్రాసెసింగ్ ఫీజు, వర్క్‌పర్మిట్ చార్జీలు, యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికెట్, ఇమ్మిగ్రేషన్ క్లియెరెన్స్ పేరిట రూ. 7,66,900 లక్షలను వివిధ బ్యాంకుల్లో శ్రీకాంత్ డిపాజిట్ చేశాడు. డబ్బు డిపాజిట్ అయిన తరువాత సైబర్ చీటర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఇంతలో ఇండియన్ వీసా ఆఫీసర్‌ను అంటూ ఫోన్ చేసి మీరు చండీఘఢ్ నుంచి కెనాడకు వెళ్లండంటూ సూచించాడు. దీంతో ఈ నెల 1న వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
ఈ క్రమంలోనే కెనడా ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా ఇదంతా మోసమని తేలింది. దీంతో బాధితుడు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







