డార్జిలింగ్ షూటింగ్ పూర్తి చేసిన తలైవా

- August 07, 2018 , by Maagulf
డార్జిలింగ్ షూటింగ్ పూర్తి చేసిన తలైవా

కబాలి , కాలా చిత్రాలతో అభిమానులను , ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసిన సూపర్ స్టార్ రజనీకాంత్..ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డార్జిలింగ్ షెడ్యూల్ పూర్తి చేసినట్లు సమాచారం. సుమారు 25 రోజుల పాటు చిత్ర యూనిట్ డార్జిలింగ్ లో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వం లో ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట.
ఇక ఈ మూవీ లో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి , బాబీ సింహ వంటి ప్రముఖ నటులు నటిస్తుండగా , సీనియర్ సౌత్ హీరోయిన్ సిమ్రాన్ తో పాటు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకరాబోతున్నారు. త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని రజనీ భావిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com