కరుణానిధి అంత్యక్రియలపై తొలగిన అడ్డంకి

- August 07, 2018 , by Maagulf
కరుణానిధి అంత్యక్రియలపై తొలగిన అడ్డంకి

కరుణానిధి అంత్యక్రియలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. మెరీనా తీరంలో ఖననం చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని మద్రాసు హైకోర్టు తెలిపింది. డీఎంకే స్థాపకుడు అన్నాదురై సమాధి దగ్గరే కరుణానిధిని ఖననం చేసేందుకు అనుమతించాల్సిందిగా స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో న్యాయపరమైన చిక్కులు వస్తాయని ప్రభుత్వం మెరినాతీరంలో అనుమతి ఇవ్వలేదు. కరుణానిధికి స్థలం కేటాయించడానికి తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగానే కరుణానిధి అంతిమ సంస్కారాలకు గిండిలో 2ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించింది. డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేసింది. ఉదయం విచారణ సందర్భంగా ప్రభుత్వం, డీఎంకే తరపున న్యాయవాదులు వాదప్రతివాదనలు వినిపించారు. తీరప్రాంత నిబంధనల వల్లే బీచ్‌లో స్థలం కేటాయించలేకపోతున్నామని అంతేకాకుండా సీఎం పదవిలో ఉండగా చనిపోతేనే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయిస్తారని ప్రభుత్వం తెలిపింది. అన్ని పక్షాల వాదనలు విన్న మద్రాసు హైకోర్టు మెరీనా తీరంలో ఖననం చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెల్చి చెప్పింది. దీంతో కరుణానిధి అంత్యక్రియలపై అడ్డంకి తొలగినైట్లెంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com